కొత్త ఇండియా మ్యాప్.. అమరావతికి అవమానమా..?

-

కేంద్ర హోంశాఖ తాజాగావిడుదల చేసిన భారతదేశ నూతన చిత్ర పటాన్ని విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్, లద్దాక్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయిన నేపథ్యంలో ఆ రెండు ప్రాంతాల సరిహద్దులతో కేంద్ర హోంశాఖ ఈ నూతన భారత రాజకీయ చిత్రపటాలను విడుదల చేసింది.

దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలు, దేశంలోని రాష్ట్రాలు, రైలు, రోడ్డు మార్గాలు, కాల్వలు వంటివి సూచిస్తూ వేర్వేరు మ్యాపులను విడుదల చేసింది. ప్రతి రాష్ట్రరాజధానిని సూచిస్తూ వాటి పేర్లను ఎర్ర అక్ష రాల్లో ప్రత్యేకంగా పేర్కొంది. విచిత్రమేమిటంటే…. ఈ పటంలో ఎక్కడా అమరావతి పేరు కనిపించకపోవడం.

అన్ని రాష్ట్రాలకూ రాజధానిని పేర్కొన్నా.. ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ఎక్కడా చెప్పలేదు. కేవలం ఒక్క ఏపీ రాజధాని మాత్రమే పటంలో లేదు. అన్ని రాష్ట్రాల రాజధానులూ ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది. బహుశా ఉమ్మడి రాజధానిగా పదేళ్ల హైదరాబాద్ ఉండటం వల్ల టెక్నికల్ గా ప్రభుత్వం అమరావతిని గుర్తించలేదనే వాదన వినిపిస్తున్నా.. అది అంత సబబుగా అనిపించడం లేదు.

ఆ పటాన్ని చూసినవారు.. ఏపీకి రాజధాని లేదా..? అని ఆశ్చర్యపోతున్నారు. కావాలని చేశారో.. తెలీక చేశారో కానీ.. ఏపీకి రాజధాని లేకుండా చేశారని మండిపడుతున్నారు. ఏపీ రాజధాని.. మ్యాప్‌లో లేకపోవడం.. అటు నేతలను ఇటు ప్రజలను ఆశ్చర్యం కల్గిస్తోంది. అమరావతి అని వేసినా పెద్దగా ఇబ్బంది లేకుండా పోయేది. ఇప్పుడు మొత్తానికి ఏపీకి రాజధానిని ఎత్తేయడం విమర్శలకు తావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version