ప్రస్తుత తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల చిన్న వయస్సు వారికి కూడా టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు తమ జీవన విధానంలో అనేక మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కింద ఇచ్చిన చిట్కాలను రోజూ పాటిస్తే టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. నిత్యం ఉదయాన్నే పరగడుపునే కొన్ని వేప ఆకులను అలాగే నమిలి మింగాలి. లేదా వేపాకుల రసం కూడా తాగవచ్చు. దీంతో కొద్ది రోజుల్లోనే టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలోకి వస్తుంది.
2. రోజూ ఉదయాన్నే పరగడుపునే 1 నుంచి 6 గ్రాముల దాల్చిన చెక్క పొడిని తీసుకోవాలి. దీని వల్ల కూడా టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
3. నిత్యం ఉదయాన్నే పరగడుపునే మెంతులను అలాగే తినేయాలి. లేదా రాత్రంతా నీటిలో నానబెట్టిన మెంతులను తినాలి. అదీ కుదరకపోతే మెంతి పొడిని నీటిలో కలుపుకుని తాగేయాలి. దీని వల్ల కూడా డయాబెటిస్‌ను అదుపులో ఉంచవచ్చు.
4. నిత్యం ఉదయాన్నే పరగడుపునే కాకరకాయ రసాన్ని తాగాలి. దీని వల్ల కూడా షుగర్ అదుపులో ఉంటుంది.