గుడ్ న్యూస్‌.. డెలివ‌రీ స‌ర్వీసుల‌ను పునః ప్రారంభించిన అమెజాన్‌..!

-

కరోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ‌లైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు త‌మ డెలివ‌రీ స‌ర్వీసుల‌ను గ‌త కొద్ది రోజుల క్రితం నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. అయితే అమెజాన్ సంస్థ త‌మ డెలివ‌రీ స‌ర్వీసుల‌ను పునః ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ క్ర‌మంలోనే దేశ‌వ్యాప్తంగా ఉన్న ప‌లు న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో అమెజాన్ డెలివ‌రీ సేవ‌లు మ‌ళ్లీ ప్రారంభ‌మ‌య్యాయి. ఇక ఏయే ప్రాంతాల్లో డెలివ‌రీ సేవ‌లు ప్ర‌స్తుతం ల‌భ్య‌మ‌వుతున్నాయో.. ఆ ప్రాంతాల లిస్ట్‌ను కూడా అమెజాన్ ప్ర‌స్తుతం విడుద‌ల చేసింది.

అమెజాన్ డెలివ‌రీ స‌ర్వీసులు ప్రారంభ‌మైన ప్రాంతాల వివ‌రాలు ఇవే…

* హైద‌రాబాద్
* బెంగళూరు
* భువ‌నేశ్వ‌ర్
* గురుగ్రాం
* జైపూర్
* జంషెడ్‌పూర్
* ల‌క్నో
* లూథియానా
* మొహాలీ
* మైసూరు
* పాట్నా
* రాయ్‌పూర్

కాగా పైన తెలిపిన ప్రాంతాల్లోని ప‌లు ఎంపిక చేసిన పిన్ కోడ్ల‌లోనే ప్ర‌స్తుతం డెలివ‌రీ సేవ‌ల‌ను అందిస్తున్న‌ట్లు అమెజాన్ తెలిపింది. ఇక వినియోగ‌దారులు ఈ విష‌యాన్ని ముందుగా తెలుసుకుని వ‌స్తువుల‌ను ఆర్డ‌ర్ చేయాల్సి ఉంటుంద‌ని అమెజాన్ తెలియజేసింది. అయితే ఇప్ప‌టికే ప్రీపెయిడ్ విధానంలో చేసిన ఆర్డ‌ర్ల‌ను మాత్ర‌మే ప్ర‌స్తుతం ప్రాసెస్‌ చేస్తున్నామ‌ని.. అందులోనూ కేవ‌లం నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను మాత్ర‌మే వినియోగ‌దారుల‌కు ప్ర‌స్తుతం డెలివ‌రీ చేస్తున్నామ‌ని.. ఆ సంస్థ తెలిపింది. ఈ క్ర‌మంలో తాము సంబంధిత ప్రాంతాల‌కు చెందిన‌ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో క‌లిసి ప‌నిచేస్తున్నామ‌ని.. క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా అన్ని జాగ్రత్త చ‌ర్య‌లు తీసుకుంటూ.. వినియోగ‌దారుల‌కు కావ‌ల్సిన నిత్యావ‌స‌రాల‌ను వారి ఇళ్ల‌కే డెలివ‌రీ చేస్తున్నామ‌ని అమెజాన్ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version