కాపుల శని కొణిదెల పవన్ కళ్యాణ్ : మంత్రి అంబటి

-

పవన్‌ కల్యాణ్‌ నేడు సత్తెనపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే.. తాజాగా పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ వైసీపీ పై విమర్శలు చేసినట్లు కనిపించినా ఆయన ఇచ్చిన సందేశం వేరని, సత్తెనపల్లి నుంచి పవన్ కళ్యాణ్ బీజేపీకి డైరెక్ట్‌గా ఒక మెసేజ్ పంపించారన్నారు మంత్రి అంబటి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి వెళ్తానని స్పష్టం చేశారని, చంద్రబాబును గెలిపించటానికి గాడిదలా మోస్తానని ప్రకటించారన్నారు మంత్రి అంబటి. మీరు కూడా నాలానే గాడిదలా చంద్రబాబును గెలిపించే బరువును మోయమంటున్నాడని, ఈ వ్యూహాన్ని ఆ పార్టీ కార్యకర్తలు అర్ధం చేసుకోవాలని, పవన్ కళ్యాణ్‌కు చాలా మందితో విడిపోవటం అలవాటు అని మంత్రి అంబటి అన్నారు. అధికారం రాని కులాలకు అధికారంలోకి తీసుకుని రావటమే జనసేన లక్ష్యం అన్నాడు పవన్ కళ్యాణ్ అని, శభాష్….ఇదే మాట మీద పవన్ కళ్యాణ్ ఉంటాడా??.. చంద్రబాబు దగ్గర పదో, పరకో తీసుకుని పొత్తులతో సర్దుకుంటాడా?? 2019లో జగన్ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నావ్‌గా… ఏమయ్యింది పవన్ కళ్యాణ్?? ఇప్పుడు సన్నాసి ఎందుకు రాజకీయాలు చేస్తున్నావ్…

చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని రాజకీయాలు చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. వారాహి అని ప్రచార వాహనాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఆలూ లేదూ సూలు లేదు… సామెత చందంగా ఉంది. వారాహి అంటే అమ్మవారి శక్తి స్వరూపం… దశావతారాల్లో ఒక అవతారం. అటువంటి పవిత్రమైన పేరు పెట్టిన వాహనం ఎక్కి కుట్రలు చేస్తే అమ్మవారు ఊరుకుంటారా??. రాజకీయ నాయకుడిగానే కాదు నటుడిగా కూడా భ్రష్టు పట్టిపోతావ్. ఇప్పటికే పవన్ కళ్యాణ్ షేప్ అవుట్ అయిపోయాడు. వారాహి పేరు మార్చి వరాహం అని పెట్టుకుంటే కొంతైనా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అమరావతిలోని దొంగ రైతులు అరసవిల్లి యాత్రకు చేస్తాం అన్నప్పుడే చెప్పాను.. అరసవిల్లి సూర్య భగవానుడు రానివ్వడు‌…ఈ యాత్ర జరగదు అన్నాను. నా పై పవన్ కళ్యాణ్ అవినీతి ఆరోపణలు చేశాడు. నేను రెండు లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. రాజకీయాల నుంచి వెళ్ళి పోతాను. పవన్ కల్యాణ్‌కు ఛాలెంజ్‌. కాపుల శని కొణిదెల పవన్ కళ్యాణ్. అని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version