చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు… తన ఫ్యాన్స్ ను కన్ఫ్యూజన్లో కి నెట్టాడు. ఓ గంట క్రితం తాను ఐపీఎల్ టోర్నీ కి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు అంబటి రాయుడు ట్వీట్ చేశారు. అయితే ఏమైందో తెలియదు కానీ… క్షణాల్లోనే రిటర్మెంట్ ప్రకటిస్తున్నట్లు చేసిన ట్వీట్ డిలీట్ చేశారు అంబటి రాయుడు. దీంతో… అంబటి రాయుడు ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
ఇక అంతకుముందు ఐపీఎల్ టోర్నీకి తాను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు ప్లేయర్ అంబటి రాయుడు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు.“ఇది నా చివరి ఐపిఎల్ అని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. నేను 13 సంవత్సరాలుగా 2 గొప్ప జట్లలో భాగమైనందుకు అద్భుతమైన సమయాన్ని కలిగి ఉన్నాను. అద్భుతమైన ప్రయాణం కోసం ముంబై ఇండియన్స్ మరియు Csk కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.” అంటూ క్రికెటర్ అంబటి రాయుడు ప్రకటించారు. కానీ కాసేపటి క్రితమే ఆ ట్వీట్ డిలీట్ చేశారు రాయుడు.