తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, సినీ ప్రముఖుల భేటీపై వైసీపీ పార్టీ నేత అంబటి రాంబాబు సంచలన ట్వీట్ చేశారు. Sofa అంటూ పుష్ప 2 సినిమా సీన్ ను గుర్తు చేస్తూ… సెటైర్లు పేల్చారు వైసీపీ పార్టీ నేత అంబటి రాంబాబు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు సినిమా పరిశ్రమ ముఖ్యులు. ఈ సందర్భంగా టాలీవుడ్ ముందు రేవంత్ సర్కార్ కండీషన్స్ పెట్టారు.
ఇకపై ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పారట రేవంత్ రెడ్డి. డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి సహకరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేర్కొందని అంటున్నారు. ప్రచార కార్యక్రమాల్లో సినిమా హీరోలు ఉండాల్సిందేనని తెలిపారట సీఎం రేవంత్ రెడ్డి. అయితే… సీఎం రేవంత్ రెడ్డి, సినీ ప్రముఖుల భేటీపై వైసీపీ పార్టీ నేత అంబటి రాంబాబు సంచలన ట్వీట్ చేశారు. సినిమా ఇండస్ట్రీ సమస్య పూర్తి పరిష్కారానికి “సోఫా” చేరాల్సిందే…అంటూ సెటైర్లు పేల్చారు. అయితే.. దీనిపై నెటిజన్స్ రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. “సోఫా” అంటే రూ. 200 కోట్లు రేవంత్ రెడ్డికి చేరాయని కామెంట్స్ చేస్తున్నారు.
పూర్తి పరిష్కారానికి
“Sofa” చేరాల్సిందే!— Ambati Rambabu (@AmbatiRambabu) December 26, 2024