బ్రేకింగ్ : తెలంగాణలో నిన్న వ్యాక్సిన్ తీసుకున్న అంబులెన్స్ డ్రైవర్ మృతి  

-

నిన్న నిర్మల్ జిల్లా కుంటాల పిహెచ్సిలో వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ఈ రోజు మరణించినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఛాతీ లో నొప్పితో బాధపడిన మృతుడు నిర్మల జిల్లా ఆస్పత్రికి వచ్చే లోపే మరణించినట్టు ఆరోగ్య శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది.  పోస్ట్ మార్టం అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని… ప్రాథమిక  పరీక్షల్లో వ్యాక్సిన్ కారణంగా మరనించలేదని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

vaccine

కుంటాల మండలం ఒలా గ్రామానికి చెందిన విఠల్ రావు అనేవ్యక్తి 108 అంబులెన్స్ డ్రైవర్‌ గా పని చేస్తున్నారు. నిన్న కుంటాల పీహెచ్సీలో విఠల్ వ్యాక్సిన్ తీసుకున్నట్టు చెబుతున్నారు. నిన్న రాత్రి అస్వస్థకు గురవడంతో నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే  చికిత్స పొందుతూ మృతి చెందాడని ముందు ప్రచారం జరిగినా లేదు ఆసుపత్రికి వచ్చేలోపే చనిపోయాడని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక మృతికి కోవాక్సిన్ కారణమా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని వైద్యులు కూడా చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version