హైదరాబాద్ మహానగరంలో ఓ దొంగ హల్చల్ చేశాడు. ఏకంగా అంబులెన్స్ చోరీకి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అంబులెన్స్ చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు సూర్యాపేట వరకు వెంబడించి పట్టుకున్నట్లు సమాచారం. హైదరాబాద్-విజయవాడ రహదారిపై సినిమా తరహాలో పోలీసులు ఛేజింగ్ చేశారు.
హయత్‌నగర్‌లో 108 వాహనాన్ని చోరీ చేసి దొంగ పారిపోతుండగా..వెంటనే అప్రమత్తమైన పోలీసులు దొంగను అతికష్టం మీద అదుపులోకి తీసుకున్నారు.ఛేజింగ్ సమయంలో అంబులెన్స్ అదుపు తప్పి ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో దొంగను పోలీసులు అదుపులోకి తీసుకుళ్లారు.కాగా, అంబులెన్స్ స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. వాహనాన్ని సైతం పోలీసులు బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో అంబులెన్స్ చోరీ.. దొంగ హల్చల్
హైదరాబాద్‌లో అంబులెన్స్ చోరీ చేసి దొంగ హల్చల్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అంబులెన్స్ చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు సూర్యాపేట వరకు వెంబడించి పట్టుకున్నారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై సినిమా తరహాలో పోలీసులు ఛేజింగ్ చేశారు.… pic.twitter.com/rTKxCPdia4
— ChotaNews (@ChotaNewsTelugu) December 7, 2024