కరోనాతో చైనా మీద అమెరికా దాడి చేసిందా…?

-

కరోనా వైరస్ బయటకు రాగానే ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరమైంది. వ్యాధి తీవ్రత ధాటికి ఇప్పటికే చైనాలో జనం పిట్టల మాదిరి రాలిపోతున్నారు. వేలాది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇక లక్షల మందికి ఇది సోకే అవకాశం ఉందని, రాబోయే నెల రోజుల్లో మరణాల సంఖ్య లక్ష దాటే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. దీనికి మందు కనుక్కోకపోతే కష్టమని అంటున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త ఆందోళన కలిగిస్తుంది. చైనా మీద అమెరికా కరోనా వైరస్ తో దాడి చేసిందని అంటున్నారు. చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇక ఇటు భారత్ తో ఉన్న అమెరికా సంబంధాలను కూడా చైనా టార్గెట్ చేసింది. దానికి తోడు తన ఆయుధ సంపత్తిని అమెరికాకు దీటుగా పెంచుకోవడమే కాదు తన పొరుగున ఉన్న ఉత్తరకొరియాను రెచ్చగొడుతుంది.

కిమ్ జోంగ్ ఉన్ కి అన్ని విధాలుగా డ్రాగన్ హెల్ప్ చేస్తుంది. ఇక పాకిస్తాన్ ని కూడా అమెరికా వ్యతిరేకంగా చైనా రెచ్చగొడుతుంది. అందుకే చైనా మీదకు కరోనాను అమెరికా వదిలి ఉండవచ్చు అని అంటున్నారు. అందుకే వైరస్ తీవ్రత ఇప్పుడు ఆ స్థాయిలో ఉందని, ఇక అమెరికా ముందు జాగ్రత్తలు తీసుకుంది కాబట్టే ఆ దేశంలో ఏ మరణం ఇప్పటి వరకు లేదని నిపుణులు అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో గాని చైనా మాత్రం చుక్కలు చూస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version