అమెరికాలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. లక్షల సంఖ్యలో కేసులు పెరగటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కేసుల సంఖ్య పెరగడంతో పాటు మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజులోనే అమెరికాలో 8 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 31 లక్షల కొత్త కేసులు నమోదు కాగా అందులో అమెరికానుండి ఎనిమిది లక్షల కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది.
ఇక అన్ని దేశాల్లో కలిపి కరోనా వల్ల ఒకే రోజు 7,855 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే దాదాపు అన్ని దేశాలు కరోనా 2 డోస్ ల వ్యాక్సిన్లను తీసుకున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ కరోనా కేసులు నమోదవడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే కరోనా ఫస్ట్ వేవ్ ,సెకండ్ వేవ్ సమయంలో కంటే మరణాల సంఖ్య తక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగిస్తోంది.