వచ్చే ఏడాది బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించడానికి గానూ ఇప్పుడు బిజెపి, తృణముల్ కాంగ్రెస్ కష్టపడుతున్నాయి. అయితే ఇప్పుడు బెంగాల్ పర్యటనకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెళ్ళారు. రెండు రోజుల పర్యటన సందర్భంగా కోల్‌కతా సమీపంలోని మాతువా దళిత కుటుంబంతో కలిసి భోజనం చేయనున్నారు. రాష్ట్రంలోని 294 అసెంబ్లీ సీట్లలో కనీసం 70 మందికి మాటువా కమ్యూనిటీ ఉంది.
వీరు ఎన్నికల ఫలితాలను కచ్చితంగా శాసిస్తారు. రాష్ట్ర జనాభాలో మాటువాస్ 16% మంది ఉన్నారు. గురు, శుక్రవారం బంకురా, కోల్‌కతాలో ర్యాలీలలో షా ప్రసంగించనున్నారు. ఆయన దక్షినేశ్వర్ ఆలయాన్ని సందర్శించి పద్మ భూషణ్ పండిట్ అజోయ్ చక్రవర్తిని కలుస్తారు. 2019 ఎన్నికలకు ముందు ఉత్తర 24-పరగణాల జిల్లాలోని ఠాకూర్ నగర్ లో ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీ నిర్వహించారు.