టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటాయి – అమిత్ షా

-

సెప్టెంబర్ 17 వేడుకల నేపథ్యంలోనే.. తెలంగాణకు అమిత్‌ షా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు అమిత్‌ షా. టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటాయని పార్టీ నేతలతో అమిత్ షా చెప్పారట. వారి పొత్తుకు అడుగులు పడుతున్నాయని.. మనం అలర్ట్‌ గా ఉండాలని తెలిపారు.

మునుగోడు ఉపఎన్నికపై అమిత్ షా నాయకులకు దిశానిర్దేశం చేశారు. బూత్ కమిటీలు పక్కాగా పనిచేయాలని సూచించారు. గ్రామాల వారీగా ఇంఛార్జ్‌ల నియామకం పూర్తి చేయాలని అమిత్ షా ఆదేశించారు. జాయినింగ్ కమిటీ ప్రగతిపై రాష్ట్ర నేతలను ఆరా తీశారు. మునుగోడు గడ్డపై కాషాయ జెండా ఎగిరేలా స్థానిక నాయకులు, రాష్ట్ర నేతలు శ్రమించాలని సూచించారు. మునుగోడులో విజయం సాధిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సులభం అవుతుందని చెప్పారు. ఇన్నాళ్లు ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం నిర్వహించేందుకు సాహసించ లేదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version