మనశ్శాంతి లేదని ఏకాంగా 53 మందిని వివాహం చేసుకున్నాడట.. అయినా..

-

ఒక వ్యక్తి రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటేనే వాడ్ని వింతగా చూస్తారు. రాజుల కాలంలో అయితే ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా నడుస్తుంది. కానీ, ఇప్పుడు అలా కాదు..కానీ చాలామంది అబ్బాయిలకు రెండో పెళ్లి చేసుకోవాలని క్రేజీ డ్రీమ్‌ అయితే ఉంటుంది కానీ అది వర్కౌట్‌ కాదని వదిలేస్తారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా 53 వివాహాలు చేసుకున్నాడు. అది కూడా 43 ఏళ్లలోనే. అంటే ఒకే ఏడాదిలో రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయనమాట.. ఎందుకు ఇన్ని పెళ్లిల్లు చేసుకున్నాడో తెలిస్తే మీ మైండ్‌ బ్లాక్‌ అవుతుంది కూడా..!

ఆ వ్యక్తి సౌదీ అరేబియాలో నివసిస్తున్నాడు. పేరు అబూ అబ్దుల్లా. అతని వయసు 63 ఏళ్లు. తొలిసారి ఆయనకు 20 ఏళ్ల వయసులో పెళ్లయ్యిందట. రెండేళ్లు బాగానే ఉన్నారు. మూడో ఏడాది గొడవలు స్టాట్‌ అయ్యాయి..దీంతో ఆమెకు తలాక్ చెప్పేసి, 23 ఏళ్లకు మరో అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. అది కూడా మూణ్నాళ్ల ముచ్చటే అయింది. మళ్లీ వివాహం చేసుకున్నాడు. అలా చేసుకుంటూ చేసుకుంటూ తనకు ఏ భార్యతో కూడా మనశ్శాంతి దొరకలేదని చెబుతున్నాడు. దానికోసమే అలా పెళ్లిళ్లు చేసుకుంటూ ఉన్నానని అంటున్నాడు ఆ వ్యక్తి… వారిలో చాలా మందికి పిల్లలు కూడా పుట్టారట..

మొదటిసారి వివాహం చేసుకున్నప్పుడు రెండో పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం తనకు లేదని, ఆమెతోనే జీవితాంతం బతకాలని అనుకున్నాడట.. కానీ ఇంట్లో గొడవలతో మనశ్శాంతి లేకుండా అయిపోయినట్టు చెప్పాడు. అయితే 53 వివాహాలు చేసుకున్నా కూడా అతను పెళ్లిలో స్థిరత్వాన్ని, మనశ్శాంతిని పొందలేకపోయాడట. అందుకే ఆయన్ను సౌదీలో శాస్త్రవేత్తలగా ‘బహుభార్యా వేత్త’ అంటూ కామెంట్ చేస్తున్నారు.. అతనికి ఈ శతాబ్ధపు బహుభార్యావేత్త అని బిరుదు కూడా ఇచ్చారు.

భార్యలు ఒకరితో ఒకరు గొడవపడడం కూడా అతనికి చిర్రెత్తుకొచ్చేదట.. అందుకే భార్యలకు తలాక్ చెప్పేశానని తెలిపాడు. మూడో వివాహం చేసుకున్నప్పుడు తన మొదటి ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చేశానని అన్నాడు. నన్ను సంతోషపెట్టగల, ఇంట్లో మనశ్శాంతి దొరికేలా చేసే భార్య కోసం వెతుకుతూనే ఉన్నాను అని చెబుతున్నాడు ఆ నిత్య పెళ్లికొడుకు..

ఒక పెళ్లి అయితే ఏకంగా ఒక రాత్రిలోనే ముగిసిపోయిందట. అతను చేసుకున్న వారిలో ఎక్కువ విదేశీ మహిళలనే ఉన్నారట.. వ్యాపారం నిమిత్తం విదేశాలకు తిరగడానికి వెళ్లేవాడు అబూ. అప్పుడు విదేశీ మహిళలను పెళ్లి చేసుకుని తెచ్చుకునేవాడట… కానీ ఆ పెళ్లి మూణ్నాళ్ల ముచ్చటే అయ్యేది. కేవలం మూడు నాలుగు నెలలకే చాలా మంది భార్యలు అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయేవారట.

ఇలా మనశ్శాంతి కోసం ఇన్ని పెళ్లిళ్లు చేసుకునే బదులు హ్యాపీగా ఒక్కడే ఉంటే అయిపోయేది కదా..! అసలు భార్యలతో మనశ్శాంతి వస్తుందనుకోవడమే అతను చేసిన తప్పు అని నెటిజన్లు అంటున్నారు. ఇంతకీ మీరేమంటారు..?
Attachments area

Read more RELATED
Recommended to you

Exit mobile version