చిరంజీవినా మజాకా..మెగాస్టార్ సినిమా కలెక్షన్స్ చూసి అమితాబ్ బచ్చన్ షాక్..!

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు. వరుస సినిమాల షూటింగుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో పాన్ ఇండియా ఫిల్మ్స్ ట్రెండ్ వచ్చింది. హీరోలు కొందరు పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. కాగా, అప్పట్లోనే చిరంజీవి నటించిన చిత్రం పాన్ ఇండియా వైడ్ గా రికార్డు కలెక్షన్స్ చేసింది. ఆ సినిమా విశేషాలు తెలుసుకుందాం.

చిరంజీవి కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ఒకటి ‘స్టేట్ రౌడీ’. రాధా, భానుప్రియ హీరోయిన్స్ గా నటించిన ఈ పిక్చర్ కు బి. గోపాల్ దర్శకత్వం వహించాడు. మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్ బ్యానర్ పై సుబ్బిరామిరెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. బప్పి లహరి అందించిన మ్యూజిక్ సినిమాకు హైలైట్ అయింది.

బాక్సాఫీసు వద్ద రికార్డులు క్రియేట్ చేసిన ఈ పిక్చర్ కు తొలుత నెగెటివ్ టాక్ వచ్చింది. కానీ, మెల్లిగా క్లిక్ అయి ఈ సినిమా సూపర్ హిట్ దిశగా కొనసాగింది. సుబ్బిరామిరెడ్డి చిరంజీవితో ప్రొడ్యూస్ చేసిన ఏకైక పిక్చర్ ఇది. కాగా, నైజాంలో అప్పట్లోనే ఈ మూవీ రూ.కోటి రూపాయలు కలెక్ట్ చేసింది.

ఈ పిక్చర్ రిలీజ్ టైమ్ కు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పాన్ ఇండియా స్టార్ గా ఉన్నారు. ఆయన సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఆయన సినిమాలను మించిన కలెక్షన్స్ ఈ పిక్చర్ కు వచ్చాయి. దాంతో బాలీవుడ్ మొత్తం షాక్ అయింది. ఓ మ్యాగజైన్ వేర్ ఈజ్ అమితాబ్ బచ్చన్ అనే టైటిల్ తో ఆర్టికల్ రాసింది. అలా ఈ సినిమా వసూళ్లతో బాలీవుడ్ కు అప్పట్లోనే చెమటలు పట్టించారు మెగాస్టార్ చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version