బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కాలేయ సంబంధింత వ్యాధితో మంగళవారం తెల్లవారు జామున 3 గంటలకు ముంబయిలోని నానావతి హాస్పిటల్‌లో అడ్మిట్ చేసిన విషయం తెలిసిందే. అయితే భయపడాల్సింది ఏమీ లేదని వైద్యులు తెలిపారు. ఆయన కేవలం రెగ్యులర్ చెకప్స్ కోసం మాత్రమే హాస్పిటల్‌లో చేరారని స్పష్టం చేశారు. త్వరలో ఆయన్ను డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే శుక్రవారం రాత్రి 9:45 గంటలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
సాధారణ వైద్య పరీక్షల కోసమే అమితాబ్ ఆసుపత్రిలో చేరారని, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పినా.. కానీ.. ఎలాంటి బులిటెన్ విడుదల చేయలేదు. మరోవైపు, అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షూటింగ్ మంగళవారం నుంచి ప్రారంభమవుతుందని షో నిర్వాహకులు తెలిపారు. కాగా, తాను టీబీ, హెపటైటిస్-బి వ్యాధుల నుంచి కోలుకున్నానని అయితే, తన కాలేయంలో 75 శాతం దెబ్బతిన్నదని అమితాబ్ ఇటీవల ప్రకటించారు.