భారత్-దక్షిణాఫ్రికా మధ్య శనివారం నుంచి చివరిదైన మూడో టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే భారత్-దక్షిణాఫ్రికా మధ్య రాంచీలో ప్రారంభమైన మూడో టెస్టులో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి రెండు టెస్టుల్లోనూ సఫారీలను చిత్తు చేసిన కోహ్లీ సేన ఈ టెస్టులోనూ విజయం సాధించి దక్షిణాఫ్రికాను వైట్‌వాష్ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని డుప్లెసిస్ సేన భావిస్తోంది.
ఈ మ్యాచ్‌లో భారత్ ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. పేసర్ ఇషాంత్‌శర్మకు బదులుగా స్పిన్నర్ నదీమ్‌ని తుది జట్టులోకి తీసుకున్నారు. నదీమ్‌కు ఇదే అరంగేట్ర మ్యాచ్. గాయం కారణంగా సఫారీ ఓపెనర్ మార్క్‌రమ్, స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌లు జట్టుకు దూరం కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే.
భారత జట్టు: మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, షాబాజ్ నదీమ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ.
దక్షిణాఫ్రికా జట్టు: డీన్ ఎల్గర్, క్వింటన్ డీకాక్, హమ్జా, డుప్లెసిస్ (కెప్టెన్), బవుమా, క్లాసెన్ (వికెట్ కీపర్), లిండే, డేన్ పీడ్ట్, రబడ, నార్ట్‌జె, లుంగి ఎంగిడి.