కరోనా బారిన పడిన బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తాజాగా తన అభిమానుల కోసం స్పెషల్ పోస్ట్ పెట్టారు. 6 రకాల వ్యక్తుల నుండి దూరంగా ఉండమని కోరారు. “అసూయ, అయిష్టత, అసంతృప్తి, కోపం, ఇతరులపై అనుమానం, ఇతరులపై ఆధారపడి జీవించడం వంటి అలవాట్లు ఉన్న వారు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. అందుకే మనం ఈ లక్షణాలు ఉండే వారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి” అంటూ బిగ్ బీ ట్వీట్ చేశారు. ఆయన సందేశాలను అభిమానులు కూడా స్పందిస్తున్నారు..
త్వరగా కోలుకుని.. ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకోవాలని ప్రార్ధిస్తున్నామని బిగ్ బీ అభిమానులు పేర్కొన్నారు. కాగా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు కరోనా సోకి ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే..అయితే.. అమితాబ్ తో పాటు.. అభిషేక్ బచ్చన్ కు, ఐశ్వర్య కు.. కూతురు ఆరాధ్య కు కూడా కరోనా సోకింది.. వీరు ప్రస్తుతం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు.. అమితాబ్ కూడా ముంబైలోని నానావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు..