కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు నిర్మల్ లో ఏర్పాటు చేసిన భారీ సభలో ప్రసంగించారు. అమిత్ షా మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని తెలంగాణ లో అధికారం లోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతే కాకుండా తెలంగాణ లో అన్ని లోక్ సభ స్థానాల్లో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ దేశంలో కలిసింది చెప్పారు. సెప్టెంబర్ 17 ని అధికారికంగా విమోచన దినంగా ప్రకటించాలని అమిత్ షా డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ , కాంగ్రెస్ మజ్లిస్ తో దోస్తీ చేస్తున్నాయని..మజ్లిస్ కు బీజేపీ భయపడదని అన్నారు. మజ్లిస్ ను ఓడిస్తెనే తెలంగాణ కు అసలైన స్వేచ్చ అని వ్యాఖ్యానించారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. తెలంగాణ లోని ఎస్సీలకు ఆదివాసీల కోసమే తమ పోరాటమని చెప్పారు. పోడు రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని వారికి పట్టాలు ఇవ్వాలని అమిత్ షా డిమాండ్ చేశారు.