బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో కార్యక్రమాలలో బిగ్ బాస్ రియాల్టీ షో కూడా ఒకటి. ఎంతోమంది సెలబ్రిటీలను ఈ షో కి తీసుకొచ్చి సుమారుగా 90 రోజులపాటు వారికి మొబైల్ ప్రపంచాన్ని అంతేకాదు బయట ప్రపంచాన్ని కూడా చూపించకుండా చేస్తారు. ఇక ఈ హౌస్ లో పలు రకాల స్కిట్లు, గేమ్లు పెట్టి కంటెస్టెంట్లను తికమక పెట్టించినా..ఎవరైతే వాటిని తట్టుకొని నిలబడగలుగుతారో వారే టైటిల్ విన్నర్ గా నిలుస్తూ ఉంటారు. ఇకపోతే అసలు విషయంలోకి వెళితే ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నా బిగ్ బాస్ సీజన్ 6 సమయం రానే వచ్చింది. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి బిగ్బాస్ సీజన్ 6 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ షో కి సంబంధించి ఫస్ట్ గ్లింప్ విడుదల చేశారు . ఇది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు.
అయితే ఈ సీజన్ కి కూడా ఎప్పటిలాగే నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రేక్షకులను సందడి చేయడానికి భారీ సెట్ అప్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.. లైఫ్ లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తర్వాతే అంటూ ఫస్ట్ గ్లింప్ మొదలవుతుంది.ఈ డైలాగ్ నాగార్జున చెప్పడంతో ప్రారంభమైన ఈ వీడియో బిగ్ బాస్ హౌస్ సెట్ అప్ ను చూపించారు. అంతేకాదు లాంచ్ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని విజువల్స్ ను అలాగే కొంతమంది కంటెస్టెంట్లను కూడా అస్పష్టంగా చూపించడం గమనార్హం.. అంతేకాదు ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా అని విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ చెప్పే డైలాగ్ కూడా ఈ ఫస్ట్ గ్లింప్ లో వినిపించింది.
<iframe width=”853″ height=”480″ src=”https://www.youtube.com/embed/kRQEO7rYPdI” title=”Bigg Boss Telugu Season 6 First Glimpse | Nagarjuna Akkineni | #BiggBossTelugu6 on Star Maa” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>