తెలంగాణ ప్రజలకు శుభవార్త…2 లక్షల జనాభాకు ఒక సమీకృత మార్కెట్

-

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో రెండు లక్షల మంది జనాభాకు ఒకటి చొప్పున సమీకృత మార్కెట్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని విషయం కెసిఆర్ తెలిపారు. వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం కేసిఆర్ కీలక ప్రకటన చేశారు. అప్పులు చేయడంలో మోడీ ని మించిన ఘనుడు లేడని మండిపడ్డారు సీఎం కేసీఆర్.

కాంగ్రెస్ వాళ్ళు చేసిన పనిని కూడా చెప్పుకోలేకపోతున్నారని అన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో 14% అప్పులు తగ్గించారని, మోడీ హయాంలో అప్పులు 54% పెరిగాయి అన్నారు. మోడీ హయాంలో ఎక్కడైనా వృద్ధిరేటు ఉందా? అని ప్రశ్నించారు. 2024 తర్వాత బిజెపి కతం అవుతుందన్నారు. బంగ్లాదేశ్ వార్ తర్వాత ఇందిరాగాంధీని వాజ్పేయి కాళికా అన్నారని గుర్తు చేశారు. అలహాబాద్ కోర్టు తీర్పుతో ఇందిరా గాంధీ ప్రభుత్వం కూలిపోయింది అన్నారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత వచ్చిన జనతా పార్టీ కొన్ని తప్పులు చేసిందని.. అనంతరం మళ్లీ ఇందిరా గాంధీకే పట్టం కట్టారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version