పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. తన కూతురిని ఇతర కులం వ్యక్తి ప్రేమిస్తున్నాడని కక్ష గట్టిన అమ్మాయి తండ్రి అతన్ని దారుణంగా హత్య చేశాడు. అయితే, ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణలో భాగంగా కీలక విషయాలు వెల్లడించారు.
ఏసీపీ కరుణాకర్ మాట్లాడుతూ.. ’నిన్న రాత్రి సమయంలో సాయికుమార్ తన స్నేహితులతో పుట్టినరోజు వేడుకలు చేసుకుంటుండగా.. అమ్మాయి తండ్రి సదయ్య, అతని భార్య సాయిని గొడ్డలితో నరికి చంపారు. అయితే, క్లూస్ టీమ్ ద్వారా సాక్ష్యాలు సేకరిస్తున్నాం. గతంలో ప్రేమ వ్యవహారంపై గ్రామంలో పంచాయతీ చేసుకొని సాయికుమార్ని హెచ్చరించారు పోలీసులకి సాయి తల్లిదండ్రులు ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. సాయి మృతికి ప్రేమ వ్యవహారమే కారణం’ అని వెల్లడించారు.