ఎమ్మెల్సీ అనంతబాబు కు బెయిల్ వచ్చింది. సుప్రీం కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అనంతబాబు మే నెలాఖరు నుంచి రాజమండ్రి జైల్లో ఉన్నారు. గతంలో పలుసార్లు రాజమండ్రి కోర్టు, హైకోర్టుల్లో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా తిరస్కరణ ఎదురైంది. అయితే.. తాజా ఏపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో గత మే నెలలో ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు ప్రధాన కారకుడు తానే నంటూ ఎమ్మెల్సీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఎమ్మెల్సీని రిమాండ్‌కు పంపించింది.
గత ఏడు నెలలుగా బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్లను కోర్టు తిరస్కరించడంతో చివరకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతడి బెయిల్‌పై రాజమండ్రి కోర్టు పలు షరతులు విధించింది. సాక్షులతో మాట్లాడటం, బెదిరించడం చేయకూడదని హెచ్చరించింది. పాస్‌పోర్టు స్వాధీనం చేయాలని , విచారణ పూర్తయ్యే వరకు విదేశాలకు వెళ్లొద్దని కోర్టు స్పష్టం చేసింది.