డిజిటల్ బాట పట్టిన లైగర్ భామ.. వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్

-

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’తో బాలీవుడ్ కి పరిచయమై వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న బీ-టౌన్ బ్యూటీ అనన్యా పాండే. ‘లైగర్‌’ చిత్రంతో దక్షిణాదిలో ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలోనే తీవ్ర వైఫల్యాన్ని ఎదురుచూసింది. అయినా ఈ భామ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు వెబ్ సిరీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది.

రానున్నదంతా డిజిటల్‌ మీడియానే అని ముందుగానే అర్థం చేసుకున్న అనన్యా.. ఇప్పుడు ఆ బాటలో వెళ్లడానికి సిద్ధమవుతోంది. ఆమె ఓ సిరీస్‌లో నటించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనన్యాను వెండితెరకు పరిచయం చేసిన ధర్మ ప్రొడక్షన్స్‌లోనే ఈ సిరీస్‌ తెరకెక్కనుంది. దీనికి ‘కాల్‌ మీ బీ’ అనే పేరుని అనుకుంటున్నట్లు సమాచారం.

ఓ పెద్ద కుంభకోణంలో ప్రధాన పాత్రధారి అయిన శ్రీమంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి నేపథ్యంగా ఈ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో దీన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ సిరీస్‌ ప్రసారం కానుంది. అనన్య ప్రస్తుతం ఆయుష్మాన్‌ ఖురానాతో ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’ చిత్రీకరణలో బిజీగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version