నెలవంకలా అందాలతో చెమటలు పట్టిస్తున్న అనన్య..!

-

తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఇటీవల అందాల ఆరబోతతో మరింత రెచ్చిపోతోందనే చెప్పాలి. అందం మొత్తం పోగు చేసి.. నడుములోనే దాచింది అన్నట్లుగా వయ్యారంగా ఫోటోలకు ఫోజులిస్తోంది. నడుము అందాలు హైలైట్ అయ్యేలా ఉన్న ఈమె తాజా ఫోటోలు నేటిజన్స్ కి మంచి హాట్ ట్రీట్ అందిస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ట్రెండీ టాప్ లో నడుము కనిపించే విధంగా అనన్య లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. అయితే ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్.. “ఈమె నడుము ఎక్కడ చేయించిందిరా బాబు అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే .. మరికొంతమంది ఈ ఫోటోలను జూమ్ చేసి మరీ చూస్తున్నారు.”

ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈమె మరొకవైపు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ కెరియర్లో మొదటిసారి లాయర్ పాత్ర పోషించారు. వకీల్ సాబ్ సినిమా కథలో కీలకమైన ముగ్గురు అమ్మాయిలలో అనన్య కూడా ఒకరు . మిగతా హీరోయిన్స్ గా అంజలి, నివేద థామస్ నటించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ప్రేక్షకులకు కూడా బాగా రీచ్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన వారందరికీ కూడా మంచి ఇమేజ్ వచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోని అనన్య కూడా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది.

ప్రియదర్శి హీరోగా 2019లో విడుదలైన మల్లేశం సినిమాతో అనన్య వెండితెరకు పరిచయమయ్యారు. తెలంగాణ చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న భారీ ప్రాజెక్టు శాకుంతలం.. మైథాలజికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఈమెకు గట్టి బ్రేక్ పడుతుందని భావిస్తున్నారు అభిమానులు. మరి ఈ సినిమాతో అనన్య ఎలాంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version