స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న సమంత ఇటీవల అనారోగ్యానికి గురైన విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తనకు మయో సిటీస్ అనే వ్యాధి వచ్చిందని, అందుకే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రిటీలు , అభిమానులు సైతం ఆమె త్వరగా కోలుకోవాలని పోస్ట్ చేస్తున్నారు.
అయితే.. తాజాగా సమంత ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. పరిస్థితి విషమించడంతో.. సమంత ఆస్పత్రిలో చేరారని ప్రచారం చేస్తున్నారు. అయితే, దీనిపై సమంత మేనేజర్ స్పందించారు. సమంత ఆరోగ్యంగా ఉందని తెలిపారు. ఆమె ఆస్పత్రిలో చేరలేదని… ఇంట్లోనే ఆరోగ్యంగా ఉన్నారని కుండ బద్దలు కొట్టి చెప్పారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు.