ఎన్నికల కమిషన్ వైఫల్యంతోనే రాష్ట్రంలో దాడులు, అరాచకాలు జరిగాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దీనంతటికీ ఎలక్షన్ కమిషనే బాధ్యత వహించాలన్నారు. ‘ఈసీ పక్షపాత ధోరణితోనే వైసీపీ నేతలపై దాడులు జరిగాయి అని అన్నారు. అధికారులను మార్చిన చోటే హింస చెలరేగింది. వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసి.. టీడీపీ నేతలను యథేచ్ఛగా బయట తిరగనిచ్చారు. కౌంటింగ్ సందర్భంగా కూడా అల్లర్లు చెలరేగే అవకాశం ఉంది’ అని ఆయన తెలిపారు.
కాగా.. పోలింగ్ తర్వాత చంద్రగిరి, నరసరావు పేట,తాడిపత్రి, మాచర్ల లో చాలా హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ఘటనలపై ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా మండిపడ్డారు.బుధవారం సీఈఓ మీనా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..అల్లర్లకు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ డీజీపీని ఆదేశించారు. 4 ప్రాంతాల్లో 144 సెక్షన్ పెట్టాం…అదనపు బలగాలు పంపించామని ఆయన తెలిపారు.