ఐదేళ్ల క్రితం ఎలా ఉన్నానో ఈరోజు అలాగే అంటున్న అనసూయ..!

-

బుల్లితెర గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ తాజాగా చేసిన ఇన్ స్టాగ్రామ్ పోస్టు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.. దాదాపు 5 సంవత్సరాల క్రితం తన లుక్ ఎలా ఉందో షేర్ చేసింది. అలాగే తనకు ఆ డ్రస్ అంటే చాలా ఫేవరెట్ అంటూ కూడా తెలిపింది. ఇకపోత యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె తన కెరీర్లో ఎదిగిన తీరు చూస్తే చాలామందికి ఆశ్చర్యం అనిపిస్తుంది. కొత్తవారికి స్ఫూర్తిదాయకం కూడా.. హీరోయిన్ కావాలనే కోరికతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె అవకాశాలు లేక సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసింది. ఆ తర్వాత 2013లో జబర్దస్త్ యాంకర్ గా అవకాశం రావడంతో అక్కడి నుంచి ఆమె కెరియర్ మలుపు తీసుకుందని చెప్పాలి.

మొదట్లో వ్యక్తిగత కారణాలతో కొంతకాలం దూరమైన అనసూయ ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చి భారీగా పాపులారిటీ దక్కించుకుంది.. ఇకపోతే అదే సమయంలో అనసూయ మీద వ్యతిరేకత విమర్శలు కూడా వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్ చూసే షోలో అనసూయ డ్రెస్సింగ్ వివాదాస్పదంగా మారింది.. అంతేకాదు తనను తన డ్రెస్సింగ్ ను జడ్జ్ చేసే హక్కు ఎవరికీ లేదు అంటూ ఘాటుగా కామెంట్లు చేసింది. ఇక ప్రతివారం ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో రకమైన డ్రెస్ ధరించి దానితో ఫోటో షూట్ లు చేసి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడం అలవాటుగా మార్చుకుంది.

ఇదిలా ఉండగా ఐదేళ్ల క్రితం అనసూయ దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసుకుంది. అప్పుడు నేను ఇలా ఉండేదాన్ని.. అలాగే నాకు ఈ కాస్ట్ అంటే చాలా ఇష్టం అని కామెంట్ చేసింది. ఇకపోతే ప్రస్తుతం అనసూయ యాంకరింగ్ మానేసిన విషయం అందరికీ తెలిసిందే .ఆమె రంగమార్తాండ సినిమాలో నటించింది.. ఈ సినిమా మార్చ్ 22వ తేదీన విడుదలకు సిద్ధం కానుండగా ఇందులో ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ ల కూతురుగా అనసూయ నటించినది.

Read more RELATED
Recommended to you

Exit mobile version