Anasuya: అవసరమైతే.. గుండు కొట్టించుకోడానికైనా సిద్ద‌మే.. స‌న్సెష‌న‌ల్ కామెంట్స్ చేసిన యాంక‌ర‌మ్మ‌

-

Anasuya: అనసూయ భ‌రద్వాజ్.. బుల్లి తెర ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అన‌వ‌స‌రం లేని పేరు. త‌నదైన హాట్ యాంక‌రింగ్ తో ఆక‌ట్టుకుంటుంది. తన అందచందాలతో ఫ్యాన్స్‌ మనసులను దోచేకొని స్టార్‌ యాంకర్స్‌లో ఒక‌రిగా నిలిచింది. ఈ బ్యూటీ కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం కాకుండా.. అవ‌కాశ‌మెచ్చిన‌ప్పుడల్లా.. వెండి తెర‌పై కూడా దూసుకెళ్తుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది అనసూయ. రంగస్థలంలో రంగమత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న అనసూయ.. బడా సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప సినిమాలో ‘దాక్షాయని’ అనే కీలక పాత్రలో నటిస్తుంది.

తాజాగా తన ఇన్‌స్టా ఫాలోవర్స్‌తో ఆస్క్‌మీ ఎనీథింగ్‌ సెషన్‌ నిర్వహించింది అనసూయ. ఇందులో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఓ అభిమాని.. పెద్ద సినిమాలో మంచి పాత్ర వస్తే.. పాత్ర కు త‌గ్గ‌ట్టుగా గుండు కొట్టించుకుంటారా అని ప్రశ్నించారు. ఏమాత్రం సందేహించ‌కుండా… తప్పకుండా.. క్యారెక్ట‌ర్ డిమాండ్ చేస్తే.. గుండు కొట్టించుకుంటా అంటూ అనసూయ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఈ డెడికేష‌న్ విన్న నెట్టిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా ప్రస్తుతం అనసూయ పుష్ప సినిమాలో దాక్షయణి పాత్రలో నటిస్తుంది. దీంతో పాటు ప్రభుదేవాతో ఓ సినిమాలో నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version