అంబేద్కర్ ను ఓడించింది కాంగ్రెస్… భారతరత్న ఇచ్చి గౌరవించింది బీజేపీ: బండి సంజయ్

-

అంబేద్కర్ స్ఫూర్తిగా ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నట్లు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఏడెనిమిది సంవత్సరాలుగా అంబేద్కర్ జయంతి, వర్థంతి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ వెళ్లలేదని బండి సంజయ్ విమర్శించారు. ఒక్కరూ కూడా అంబేద్కర్ ను కొలవలేదు, ఒక్క రోజు కూడా అంబేద్కర్ ని తలుచుకోలేదని ఆయన విమర్శించారు. అంబేద్కర్ స్ఫూర్తి, ఆయన చరిత్రను సమాజానికి అందించే ప్రయత్నం చేయలేదని… సీఎం కేసీఆర్ ఆయన నోటి నుంచి అంబేద్కర్ ను స్మరించుకోలేదని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల పాలనకు, కుటుంబ పాలన, నయా నిజాం పాలనకు వ్యతిరేఖంగా ప్రజాసంగ్రామ యాత్రను చేపడుతున్నామని బండి సంజయ్ అన్నారు. అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని కల్వకుంట్ల రాజ్యాంగానికిి వ్యతిరేఖంగా ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నామని అన్నారు. అంబేద్కర్ బిక్ష వల్లే తాను ప్రధానిని అయ్యానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారని.. ఆ మహనీయుడిని బీజేపీ పనిచేస్తుందని బండి సంజయ్ అన్నారు. అంబేద్కర్ కు మంత్రి పదవి ఇవ్వని, ఆయన్ను ఓడించిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చి గౌరవించిన పార్టీ బీజేపీ అని అన్నారు. సీఎం కేసీఆర్ గడీల నుంచి బయటకు వచ్చి ఆ మహనీయుడిని తలుచుకోవాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version