బ్రేకింగ్‌ : ఏలూరు పోరస్‌ కంపెనీ తాత్కాలికంగా మూసివేత

-

ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ కంపెనీలో ఇవాళ రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 6 గురు మృతి చెందగా…,13మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో బాధితులను నూజివీడులోని ఏరియా ఆసుపత్రి మరియు జియంహెచ్ ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

అయితే.. ఈ ప్రమాదం జరుగడంతో.. స్థానికంగా ఉన్న గ్రామస్తులు.. ఫ్యాక్టరీ ని మూసివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఏలూరు కలెక్టర్‌ పోరస్ కెమికల్ కంపెనీ తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోరస్ కెమికల్ కంపెనీకి తాళాలు వేశారు అధికారులు.

ఇక ప్రస్తుతం పోరస్ కెమికల్ కంపెనీ… దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటు ఈ అగ్ని ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు రూ. 25 ల‌క్షల ఎక్స్ గ్రేషియా ను సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ వారికి రూ. 5 ల‌క్షలు, గాయప‌డ్డ వారికి రూ. 2 ల‌క్షలు ప‌రిహారం చెల్లిస్తున్నట్టు ఆయ‌న వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version