ఐదు టెస్టులలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా వైజాగ్, రాజ్‌కోట్ టెస్ట్‌లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాంచీ వేదికగా జరగబోయే నాలుగో టెస్ట్‌కు వ్యూహాలను రచిస్తుంది. ఇప్పటికే టీమిండియా 2-0 ఆధిక్యంలో ఉంది.నాలుగో టెస్ట్‌లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆడటం అనుమానంగా ఉంది. అతడిపై తీవ్రమైన వర్క్‌లోడ్ ఉండటంతో బీసీసీఐ విశ్రాంతి ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న కేఎల్ రాహుల్ నాలుగో టెస్ట్‌కూ దూరం కానున్నట్లు సమాచారం.
బుమ్రా స్థానంలో యువ పేసర్ ముకేశ్ కుమార్‌ను తుది జట్టులోకి తీసుకోనున్నారు. కేఎల్ రాహుల్ స్థానంలో రజత్ పటిదార్‌కు మరొక అవకాశం ఇవ్వనున్నారు. ఇక సిరాజ్, ముఖేష్ కుమార్ పేస్ బౌలింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు.ఈ మ్యాచ్ ఉదయం 9.30 నుంచి స్పోర్ట్స్18లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
ఇండియా (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి, గిల్, రజత్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్, రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్, మొహ్మద్ సిరాజ్, ముఖేశ్/అకాశ్‌దీప్.