India vs New Zealand, Final : టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. నేడు దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఉండనుంది. ఈ ఫైనల్ పోరులో భారత్ తో తలపడబోతోంది న్యూజిలాండ్.. టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇవాళ్టి ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయింది.
అయితే.. టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇవాళ్టి ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడతాడా లేదా అనేది అందరిలోనూ టెన్షన్ నెలకొంది. నిన్న ప్రాక్టీస్ సమయంలో విరాట్ కోహ్లీ గాయపడ్డాడట. దీంతో అతను ఆడటంపై అనుమానాలు ఉన్నాయి. టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇవాళ్టి ఫైనల్ మ్యాచ్ ను జియో హాట్ స్టార్ లో ఉచితంగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్, న్యూస్ 18 లో కూడా మ్యాచ్ వస్తుంది.