‘పక్కా కమర్షియల్’గా..‘అందాల రాశి..మేకప్ వేసి’ ఫుల్ సాంగ్ వచ్చేసింది..

-

మ్యాచో మ్యాన్ గోపీచంద్ హీరో, రాశీ ఖన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పిక్చర్ ‘పక్కా కమర్షియల్’. ఈ సినిమా వచ్చే నెల 1న విడుదల కానుంది. కాగా, ఈ చిత్రంలోని ‘అందాల రాశి’ ఫుల్ సాంగ్ వీడియోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

ఈ సాంగ్ కు కృష్ణ కాంత్ లిరిక్స్ అందించగా, సాయిచరణ్ భాస్కరుణి, రమ్య బెహరా సాంగ్ పాడారు. జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అందించిన ఈ పాటలో గోపీచంద్, రాశీ ఖన్నా అత్యద్భుతంగా డ్యాన్స్ స్టెప్స్ వేశారు. సత్యరాజ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ తో కలిసి సినిమాను బన్నీ వాసు ప్రొడ్యూస్ చేశారు.

సాంగ్ లో గోపీచంద్ , రాశి ఖన్నాల కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయింది. అలా స్వర్గం నుంచి దిగి వచ్చిన సుందరిలాగా రాశీ ఖన్నా చాలా చక్కగా కనబడుతోంది. గోపీచంద్ ఈ చిత్రంలో వకీల్ సాబ్ గా కనిపించనున్నారు. రాశీ ఖన్నా కూడా వకీలుగా కనిపించనున్నారని తెలుస్తోంది. సినిమాలో మారుతి మార్క్ ఉండబోతున్నదని ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ద్వారా స్పష్టమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version