ఐపీఎల్ 2020లో తెలుగు క్రికెటర్లు ముగ్గురే..!

-

ఈ ఏడాది ఐపీఎల్ 13 సీజన్‌లో తెలుగు రాష్ట్రలకు చేసిన క్రికెటర్లు కేవలం ముగ్గురే బరిలో దిగుతున్నారు. తెలుగు క్రికెట్ అసోషియేషన్‌ల వైఫ్యలమో ఏమో కానీ మన ఆటగాళ్లు ఐపీఎల్‌కు కూడా ఎంపికవ్వడం లేదు. ఈ సీజన్‌లో అంబటి రాయుడు, మహ్మద్ సిరాజ్, బావనక సందీప్ ఆడనున్నారు. వీరిలో సందీప్ తొలిసారి ఐపీఎల్ ఆడుతున్నాడు. హైదరాబాద్‌‌ రామ్‌నగర్‌కు చెందిన 27 ఏళ్ల సందీప్‌ను సన్‌రైజర్స్ కనీస ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఇప్పటికే ఈ క్యాష్ రిచ్ లీగ్ నిర్వహణ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దూకుడు పెంచింది.

కరోనా ముప్పు నేపథ్యంలో యూఏఈకి తరలించిన భారత బోర్డు.. ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతిరానప్పటికీ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు లీగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 2న జరిగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్(జీసీ) సమావేశంలో లీగ్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశం అనంతరమే లీగ్ విధివిధానాలకు సంబంధించి తయారు చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ)ను ఫ్రాంచైజీలకు బోర్డు అందజేయనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version