AP Budget 2023-24 : ఏపీ వార్షిక బడ్జెట్.. శాఖల వారీగా కేటాయింపులు

-

ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రూ.2.79 లక్షల కోట్లు బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. పోతన పద్యంతో, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వ్యాఖ్యలతో తన బడ్జెట్‌ ప్రసంగాన్ని మొదలుపెట్టారు.

బడ్జెట్ ప్రసంగంలో బుగ్గన.. బడ్జెట్‌ రూపకల్పనలో భాగస్వాములైన వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో ఆటుపోట్లను అధిగమించామని మంత్రి అన్నారు. ఈ బడ్జెట్‌ సుస్థిర అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి సారించామని వెల్లడించారు.

శాఖల వారీగా కేటాయింపులు..

  • మొత్తం బడ్జెట్‌- 2 లక్షల 79 వేల కోట్లు
  • రెవెన్యూ వ్యయం – 2,28,540 కోట్లు
  • మూలధన వ్యయం – 31,061 కోట్లు
  • రెవెన్యూ లోటు – 22,316 కోట్లు
  • ద్రవ్య లోటు – 54,587 కోట్లు
  • జీఎస్డీపీలో రెవెన్యూ లోటు – 3.77 శాతం
  • ద్రవ్య లోటు – 1.54 శాతం
  • వ్యవసాయ శాఖ- రూ. 11589.48 కోట్లు
  • సెకండరీ ఎడ్యుకేషన్‌- రూ. 29,690.71 కోట్లు
  • వైద్యారోగ్య శాఖ- రూ. 15,882.34 కోట్లు
  • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి- రూ. 15,873 కోట్లు
  • ట్రాన్స్‌పోర్ట్‌, ఆర్‌ అండ్‌ బీ- రూ. 9,118.71 కోట్లు
  • విద్యుత్ శాఖ- రూ. 6546.21 కోట్లు
  • ఎస్సీ కార్పొరేషన్- రూ. 8384.93 కోట్లు
  • ఎస్టీ కార్పొరేషన్- రూ. 2428 కోట్లు
  • బీసీ కార్పొరేషన్- రూ. 22,715 కోట్లు
  • ఈబీసీ కార్పొరేషన్- రూ. 6165 కోట్లు
  • కాపు కార్పొరేషన్- రూ. 4887 కోట్లు
  • క్రిస్టియన్ కార్పొరేషన్- రూ. 115.03 కోట్లు

Read more RELATED
Recommended to you

Exit mobile version