ఏపీ లో కర్ఫ్యూ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే కర్ఫ్యూ అమలు అయినప్పటి నుంచి ఏపీలో కరోనా కేసులు తగ్గు ముఖం పడుతున్నాయి. ఇక ఏపీ మొన్నటి వరకు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య 10 వేల లోపునకు పడిపోయాయి. అయితే తాజగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6952 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,03,074 కు పెరిగింది.
ఒక్కరోజు వ్యవధిలో మరో 53 మంది చనిపోవడంతో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 11,882 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 91,417 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. నేడు కొత్తగా 11,577 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 16,99,775 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇవాళ ఏపీ వ్యాప్తంగా 1,08,616 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది వైద్యశాఖ. దీంతో రాష్ట్రం మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 2,03,48,106 కు చేరుకుంది.