ప్రభుత్వ పథకాలతో ఎర్రగుంట్లలో 93 శాతం మంది లబ్ది : సీఎం జగన్

-

నంద్యాల జిల్లా ఎర్రగుంట్ల ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. రూ.48,74,38,136 కోట్లు నేరుగా వివిధ పథకాల ద్వారా అందించాం. ఎక్కడా లంచాలు లేవు.. ఎక్కడ వివక్ష లేదు.  అర్హత ఉంటే చాలు పథకాలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ రైతు భరోసా, అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా కింద ఈ ఒక్క గ్రామానికే కోట్లాది రూపాయలు అందించామని తెలిపారు. ప్రభుత్వ పథకాలతో ఎర్రగుంట్లలో 93 శాతం మంది లబ్ది పొందారు.

ఒక్క గ్రామంలోనే కేవలం 1496 ఇళ్లు ఉన్న ఈ గ్రామంలోనే  ఇంత అభివృద్ధి జరిగింది.  ఇది కాకుండా.. నాన్ డీబీటీ మనం ప్రభుత్వం చేస్తున్న ఇళ్ల పట్టాలు, గోరుముద్దలు, రైస్ కార్డులకు సంబంధించి, 8వతరగతి చదువుతున్న పిల్లలకు ట్యాబ్ ల గురించి చెప్పడం లేదన్నారు. ఏ పార్టీ అని చూడకుండా అందరికీ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. మన ప్రభుత్వానికి ముందు ఏ ప్రభుత్వం ఇలా ప్రజలకు ఇవ్వలేదన్నారు. 75 ఏళ్ల ముసలాయన పని చేశారు. ఇంత చిన్నోడు చేసిన పనులు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వారు చేశారా..? అని ప్రశ్నించారు సీఎం జగన్. పేదల బ్రతుకులు ఏ రకంగా మారాయి అనేది ఒక్కసారి గమనించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version