పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. మళ్లీ మోసపోవడమేనని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇవాళ రేపల్లేలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేదలకు 31లక్షల ఇండ్ల పట్టాలు ఇచ్చామని, మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేశామని గుర్తు చేశారు. మరో వారం రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుంది. రాబోయే ఐదేళ్ల భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలు ఇవి అని.. ఈ ఎన్నికల్లో మీ బిడ్డ జగన్ కు ఓటేస్తే.. పథకాలు అన్ని కొనసాగుతాయి. పొరపాటు కూడా చంద్రబాబుకు ఓటేస్తే.. కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నారు.
అవ్వతాతలకు ఇంటి వద్దనే రూ.3వేల పెన్షన్, ఇంటి వద్దనే రేషన్ సరుకులు, పౌరసేవలు వంటివి కొనసాగుతున్నాయి. కానీ చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏం మంచి చేశాడో చెప్పాలన్నారు. గతంలో ఎప్పుడైనా మీ బిడ్డ పెట్టిన పథకాలను మీరు ఎప్పుడైనా చూశారా..? అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు 2లక్షల 30వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు సీఎం జగన్. చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కారని గుర్తు చేశారు.