ఈ ఏడు ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పగలరా ? : చంద్రబాబు

-

విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. ‘ప్రజాగళం’ యిందని టీడీపీ అధినేత చంద్రబాబు  యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన రోడ్లో ఆయన మాట్లాడారు. 90 శాతం. హమీలు నెరవేర్చానని చెబుతున్న జగన్.. తన 7 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ప్రత్యేకహోదా, సీపీఎస్ రద్దు, మద్య నిషేధం, ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, కరెంటు ఛార్జీల తగ్గింపు, పోలవరం పూర్తి తదితర హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. గోదావరి జలాలను రాయలసీమకు తీసుకొచ్చే బాధ్యత తమదని చెప్పారు. సీమను తాము హార్టికల్చర్ హబ్ చేస్తే.. రాజకీయ హత్యలతో సైకో రాజ్యంగా జగన్ మార్చారని మండిపడ్డారు.


విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు మాకు మద్దతివ్వండి. అక్రమ కేసులు, బెదిరింపులకు ఎవరూ భయపడొద్దు. గత ఎన్నికల్లో రాయలసీమలోని 52 సీట్లలో 49 చోట్ల వైసీపీ ని  గెలిపిస్తే ఏం ఒరగబెట్టారు? ఈసారి 52 చోట్లా కూటమి అభ్యర్థులను గెలిపించాలి. తన చర్యలతో రాష్ట్రాన్ని జగన్ లూటీ చేశారు. అసమర్థుడు.. అవినీతిపరుడిని ఇంటికి పంపాలి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. విద్యుత్ ఛార్జీలు, మద్యం ధరలను అమాంతం పెంచేశారు అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version