ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబుకే అలవాటు : ఎంపీ కేశినేని నాని

-

ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబుకు అలవాటు అని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఏబీ వెంకటేశ్వర రావుతో ఫోన్ ట్యాపింగ్ చేయించింది చంద్రబాబే అన్నారు.  గతంలో మోడీ.. చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేశాడని ఆరోపించాడు. ఇప్పుడు అదే మోడీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు. చంద్రబాబు ఇప్పుడు ఎన్డీయేలోనే ఉన్నారుగా దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరిపించండి.. నా ఫోన్ ని 2018 నుండి ట్యాప్ చేస్తున్నారు. నా ఫోన్ ట్యాప్ చేసుకున్నా నాకేం భయం లేదు అన్నారు.


సీఎం జగన్ కి, నాకు ఫోన్ ట్యాప్ చెయ్యాల్సిన అవసరం లేదు.  ఫోన్ ట్యాప్ చెయ్యడానికి కానిస్టేబుల్ ని పంపిస్తారా..? చంద్రబాబు హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, మాదాపూర్ ఓ ఇంట్లో ఉండి ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారు.  విజయవాడ టీడీపీ అభ్యర్థి నేర చరిత్ర కలిగిన వ్యక్తి.  ఆయన భూకబ్జాలు, చీటింగ్, నేర చరిత్రలపై త్వరలో పుస్తకాలు వస్తాయి. విశాఖలో డ్రగ్స్ తెప్పించింది చంద్రబాబు సన్నిహితులే.
లోఫర్లు, చీటర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు టీడీపీ సీట్లు ఇచ్చింది అన్నారు. రూ.100 కోట్లకి చంద్రబాబు ఆ సీటు అమ్మేశాడని స్వయంగా దేవినేని ఉమనే చెప్పాడని గుర్తు చేశారు

Read more RELATED
Recommended to you

Exit mobile version