రాష్ట్రం అప్పులు ఊబిలో ఉందన్న చంద్రబాబు.. ఎన్నికలు రావడంతో చంద్రబాబు ఇప్పుడు ప్రతి ఇంటికి రెండు పథకాలు ఇస్తానంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నాడని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీలంక అవుతుందని చెప్పిన చంద్రబాబు.. సంక్షేమ పథకాలు ఇస్తానని ఎలా హామీ ఇస్తున్నాడు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు సీఎం జగన్ భయపడరు ఆ రోజుల్లో సీఎం జగన్ కేంద్రంలో ఉన్న ఐరన్ లేడీని ఎదిరించిన వ్యక్తి అన్నారు.
పవన్ కల్యాణ్ లాంటి పిల్ల రాజకీయ నాయకులు గురించి మాట్లాడుకోవడం అనవసరం అన్నారు. * ముందు పవన్ కల్యాణ్ పిఠాపురంలో గెలిచి మాట్లాడాలి. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడటం కలగానే మిగులుతుందన్నారు. కక్ష సాధింపు చర్యలు చేసేది చంద్రబాబే అని.. దిక్కుమాలిన కూటమి, పనికిమాలిన రాజకీయ నాయకులకు రాష్ట్ర ప్రజలు ఓటు ఎవరు వేయరు పిల్ల సినిమా యాక్టర్లు గురించి భయపడే వాళ్లు ఎవరు లేరు. చంద్రబాబుకు విజయవాడ నగరంలో పర్యటించే అర్హత లేదన్నారు. విజయవాడ నగర అభివృద్ధిని చంద్రబాబు విస్మరించాడు. సీఎం జగన్ బస్సు యాత్రకు విజయవాడ నగర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.