లీడర్ షిప్ అంటే.. చెప్పిన ప్రతి మాట అమలు చేస్తూ ముందుకు వెళ్లడమే అని సీఎం జగన్ పేర్కొన్నారు. తాజాగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించి నిష్టగా అమలు చేశామని సీఎం జగన్ తెలిపారు. ప్రతీ ఇంట్లో మా మేనిఫెస్టో ఉంది. నాయకుడిని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారు. సాధ్యం కాదని తెలిసి.. ఒక రాజకీయ నాయకుడు అమలు కానీ హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నాడు.
2014లో మేనిఫెస్టోను విడుదల చేసి ఇచ్చిన హామీలను అమలు చేయలేదు.. మళ్లీ ఇదే తరహాలో ప్రజలను మోసం చేయడం అన్యాయం కాదా..? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా అని చంద్రబాబు వెటకారం చేయలేదా..? అని ప్రశ్నించారు జగన్. ఐదేళ్లలో చంద్రబాబు కేవలం 32వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. మొట్టమొదటిసారిగా ఏపీలో సామాజిక న్యాయం అమలు అవుతోందన్నారు.