దేశ చరిత్రలో తమ పాలన చిరస్థాయిగా నిలిచిపోతుందని సీఎం జగన్ అన్నారు. కరోనాతో ఆర్థిక పరిస్థితి కుదేలైనప్పటికీ పథకాలను మాత్రం ఆపలేదన్నారు. రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటేనే మరో 15 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం ఉండాలని తెలిపారు సీఎం జగన్. 2014లో ఇదే కూటమి ఇచ్చిన మేనిఫెస్టోను ప్రజలు నమ్మారు. ఆ హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు బతుకులు ఛిన్నాభిన్నమయ్యాయి. చంద్రబాబు ఒక్క హామీనైనా నెరవేర్చారా..? ప్రత్యేక హోదాను అమ్మేశారు అని దుయ్యబట్టారు.
2019 మేనిఫెస్టోలో 99 శాతం పై చిలుకు హామీలను అమలు చేశామని.. వీటి అమలు సాధ్యమేనా అని ప్రశ్నించారు. కానీ సాధ్యం చేసి చూపించాం. చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు లా అబద్దపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయాలనుకోలేదు. చేయగలిగిన హామీలనే ప్రకటించి నిజాయితీగా అమలు చేశామని తెలిపారు.