ఏపీ ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని జనసేనాని పవన్ కళ్యాణ్ తెలిపారు. తాజాగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామన్నారు. నా జీవితంలో ఇప్పటివరకు విజయం తెలియదు. సినిమాల్లో తొలిప్రేమ అనే విజయం చూశాం. నేను విజయం సాధించానని డబ్బులు వచ్చాయని ఏ క్కరూ చెప్పరు. ఎంత ఎదిగానో నాకే తెలియదు.
21 సీట్లకు 21 సీట్లు గెలిచే వరకు నాకే తెలియదన్నారు. భారతదేశంలో 100 కి 100 శాతం విజయం సాధించింది జనసేన పార్టీనే అన్నారు. ఏపీకి చీకటి రోజులు ముగిశాయి. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష.. మార్పు కావాలి.. పాలన మారాలి ఇవన్నీ కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష నెరవేరింది. జవాబుదారితనంతో పని చేస్తాం. కక్ష సాధింపుల సమయం కాదిది. ఏపీ భవిష్యత్ కి బలమైన పునాది వేసే సమయం అన్నారు. అన్నం పెట్టే రైతుకు అండగా ఉండే సమయం. రక్షణ లేని ఆడబిడ్డలకు రక్షణ కల్పించే సమయం ఇది. ప్రభుత్వ ఉద్యోగులకు మాట ఇస్తున్నా..కాంట్రిబ్యూటిడ్ స్కీమ్ ఏడాది లోపు తీసుకొస్తాం. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే బాధ్యత మనం తీసుకున్నాం. యువతకి చదువుకి తగ్గ ఉద్యోగాలు కల్పిస్తాం.