ఈరోజు ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ను రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తున్నందుకు పోలీసులు అరెస్టు చేశారు. ఇతనిని ఉరవకొండ పోలీస్ స్టేషన్ కి కాకుండా కనేకల్ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. పయ్యావుల కేశవ్ అరెస్ట్ చేస్తున్న సమయంలో పోలీసులు మరియు రైతుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఎమ్మెల్యే తో పాటు మరికొంతమంది నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
కాగా… ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ జీబీసీకి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అనంతపురం మరియు బళ్లారి హైవేకి హంద్రీనీవా కాలువకి సమీపంలో రైతులతో కలిసి ఆందోళన చేపట్టాడు.
రైతులు వేల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారని సాగునీటిని విడుదల చేయలేకపోవడంతో ఎండిపోతుందని తెలిపాడు. అయితే హంద్రీనీవా నుంచి సాగునీటిని విడుదల చేసే వరకు ఆందోళన తగ్గించేది లేదని రైతులు స్పష్టం చేశారు