నిన్న మంత్రుల కమిటీ ఉద్యోగులతో చర్చించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇవాళ ఉద్యోగుల అభిప్రాయాలను సీఎం జగన్ కు వివరించనున్నారు సజ్జల. అంతేకాదు.. మంత్రుల కమిటీ తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 70 ఏళ్లు పై బడిన పెన్షనర్లకు ఐదు శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని.. 75 ఏళ్ళు పైబడిన పెన్షనర్లకు 10 శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది మంత్రుల కమిటీ.
అంటే 70 నుంచి 80 ఏళ్ల మధ్యలో అదనంగా రెండు స్లాబ్ లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారన్న మాట. కొత్త పిఆర్సి జీవన ప్రకారం పదేళ్లకు ఒకసారి కేంద్ర పిఆర్సి అమలు చేయాలని.. తాజా ప్రతిపాదన ప్రకారం యధాతధంగా ఐదు సంవత్సరాల కొకసారి రాష్ట్ర పిఆర్సి ఉంటుందని పేర్కొంది.
జీవోల ప్రకారం ఐఆర్ రికవరీ జరుగుతుందని.. తాజా ప్రతిపాదన ప్రకారం రికవరీ అంశం తొలగింపు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఫిట్ మెంట్ 23 శాతం కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఈ అంశాలను మరికాసేపట్లోనే.. సీఎం జగన్ మోహన్ రెడ్డి.. మంత్రుల కమిటీ వివరించనుంది. అనంతరం.. వీటికి సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా.. ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉంది.