తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీ వారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ తరుణంలోనే..తిరుమల శ్రీవారి భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచివున్నారు. దీంతో తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక 88,623 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు.
43,934 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.67 కోట్లుగా నమోదు అయింది. అటు తిరుమలలో బ్రేక్ దర్శనం టికెట్లు కొనుగోలు మరియు గదుల బుకింగ్ చెల్లింపులను టిటిడి పాలక మండలి సులభతరం చేయనుంది. పే లింకు ఎస్ఎంఎస్ ద్వారా సొమ్ము బదిలీ చేసే విధానాలను విస్తరిస్తోంది. ప్రస్తుతం తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్ల కేటాయింపుల అభ్యర్థుల చెల్లింపులను పేలింక్ ద్వారా భక్తులు చేస్తుండగా… దీన్ని విఐపి బ్రేక్ దర్శనం మరియు ఇతర సేవలు, గదుల బుకింగ్ కు చేయనుంది. పే లింక్ ఎస్ఎంఎస్ పంపిస్తే వారు దానిపై క్లిక్ చేసి సొమ్ము చెల్లించవచ్చు.