ఏపీలో 2024 ఎన్నికల కోసం వ్యూహరచనలో ఉన్న వైసీపీ అధినేత సీఎం జగన్ ఇవాళ బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ వైసిపి కార్యకర్తలతో సమావేశం అయ్యారు. వచ్చే ఎన్నికలకు పార్టీని గ్రామస్థాయి నుంచి సన్నద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మూడేళ్లలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని, ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు గణాంకాలతో సహా వివరించాలని సూచించారు. కలిసి పని చేస్తేకలిసి పనిచేస్తే 175 కి 175 సీట్లుు సాధించగలమని.. ఇదేమీ కష్టం కాదు, అసాధ్యం కానే కాదని తెలిపారు.
అయితే ఇప్పటికే ఏపీలో వరుస విజయాలు సాధిస్తున్న వైసిపి.. వచ్చే ఎన్నికలలోను అన్ని స్థానాలు గెలుచుకోవాలని సీఎం జగన్ టార్గెట్ పెట్టారు. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయని.. ఇందులో వైసీపీ తిరిగి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో పాటు అన్ని స్థానాలని కైవసం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టిన వైసిపి నేతలు.. ఇందులో ప్రజల నుంచి ఫీడ్బ్యాగ్ తీసుకుంటున్నారు. వాటి ఆధారంగా తదుపరి వ్యూహం ఖరారు చేసే పనిలో ఉన్నారు.