Tirumala : సంక్రాంతి సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. టోకెన్లు లేనివారికి శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి ఏటీసీ క్యూ లైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు.
అటు నిన్న 80 వేలమంది శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. 27వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న రూ. 3.89 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.
ఇక అటు విశాఖలో నేడు సింహాద్రి అప్పన్న దేవాలయంలో గజేంద్ర మోక్షం ఉత్సవం జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవిలతో వరదాభయ అలంకారంతో దర్శనమివ్వనున్నారు అప్పన్న. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సింహగిరి క్రిందనున్నపూలతోట ఉద్యానవనానికి రానున్నారు స్వామి, అమ్మవార్లు.. ఉత్సవం సందర్భంగా సాయంత్రం నుంచి భక్తులకు దర్శనాలు నిలిపివేస్తారు.