సజ్జల భార్గవ్ రెడ్డికి షాక్‌.. ఆయన తల్లికి ఏపీ పోలీసులు నోటీసులు జారీ

-

41-E notices issued to Sajjala Bhargav Reddy: కడప జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాజాగా సజ్జల భార్గవ్ రెడ్డికి 41-ఎ నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు. సజ్జల భార్గవ్ రెడ్డి అందుబాటులో లేకపోయే సరికి విజయవాడ వెళ్లి భార్గవ్ తల్లికి నోటీసులు అందించారు పులివెందుల పోలీసులు. అలాగే పులివెందులలో జగన్ బంధువు అర్జున్ రెడ్డికి 41-ఎ నోటీసులు ఇచ్చారు పోలీసులు. పులివెందులలో అర్జున్ రెడ్డికి ఇంటికి నోటీసులు అంటించి వచ్చారు పోలీసులు.

41-E notices issued to Sajjala Bhargav Reddy

ఈ నెల 8న ఐటీ, బీఎన్‍ఎస్‍, అట్రాసిటీ చట్టాల కింద సజ్జల భార్గవ్ రెడ్డి, జగన్ బంధువు అర్జున్ రెడ్డిపైన కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే… ఎ-1 వర్రా రవీందర్ రెడ్డి, ఎ-2 సజ్జల భార్గవ్ రెడ్డి, ఎ-3 అర్జున్ రెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. సోమవారం అంటే రేపు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. వర్రా రవీందర్ రెడ్డి కేసులో మరో 15 మందికి నోటీసులు జారీ చేసిన పోలీసులు…తాజాగా సజ్జల భార్గవ్ రెడ్డికి 41-ఎ నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version